ఎన్ హెచ్ఆర్సీ ముందు హాజరైన దిశ కుటుంబ సభ్యులు... తోడుగా వచ్చిన కాలనీవాసులు!
Add ap7am to your home Screen

ఎన్ హెచ్ఆర్సీ ముందు హాజరైన దిశ కుటుంబ సభ్యులు... తోడుగా వచ్చిన కాలనీవాసులు!

  • దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఎన్ హెచ్ఆర్సీ విచారణ
  • దిశ తల్లిదండ్రులకు పిలుపు
  • స్టేట్ మెంట్ రికార్డు చేసిన ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ చేస్తున్న దర్యాప్తు రెండోరోజు కూడా కొనసాగింది. దిశ తల్లిదండ్రుల నుంచి స్టేట్ మెంట్ తీసుకోవాలని ఎన్ హెచ్ఆర్సీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో దిశ కుటుంబ సభ్యులు పోలీస్ అకాడమీలో బస చేసిన ఎన్ హెచ్ఆర్సీ బృందం ఎదుట హాజరయ్యారు. దిశ తండ్రి, సోదరి సభ్యులు చెప్పిన విషయాలను ఎన్ హెచ్ఆర్సీ సభ్యులు రికార్డు చేశారు.

దాదాపు అరగంట పాటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన జరిగిన రోజు, ఆ తర్వాతి పరిణామాలపై వివరాలు సేకరించారు. నిందితుల ఎన్ కౌంటర్ మీడియాలో వచ్చేవరకు తనకు తెలియదని దిశ తండ్రి ఎన్ హెచ్ఆర్సీ సభ్యులతో చెప్పినట్టు తెలిసింది. కాగా, దిశ కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కూడా పోలీస్ అకాడమీకి వచ్చారు. మానవ హక్కుల కమిషన్ ఇప్పటికే నిందితుల కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్ కూడా రికార్డు చేసింది.
NHRC
Disha
Hyderabad
Police
Telangana

More Telugu News