ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు: విజయసాయి రెడ్డి
- ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే అభ్యంతరముండదు
- ఒకే సినిమాలో హీరోగా, విలన్ గా నటిస్తే అయోమయం నెలకొంటుంది
- ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది
- పవన్ నిజజీవితంలో తీరు ఇలాగే ఉంది
'ఒక సినిమాలో హీరోగా మరో మూవీలో విలన్ గా నటిస్తే ఎవరికీ అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆ నటుడు కథానాయకుడిగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులు అయోమయానికి గురవుతారు. సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇప్పుడా ఫ్లాప్ మూవీలోనే పవన్ నాయడు ద్విపాత్రాభినయం చేస్తున్నాడు' అని విజయసాయి రెడ్డి చురకలంటించారు.