కర్ణాటక హనీ ట్రాప్ కేసులో ముగ్గురు హీరోయిన్ల పేర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్ణాటక హనీ ట్రాప్ కేసులో ముగ్గురు హీరోయిన్ల పేర్లు!

  • సంచలనం రేపుతున్న హనీట్రాప్ కేసు
  • పలువురు ఎమ్మెల్యేల శృంగార వీడియోలు బట్టబయలు
  • ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతున్న రాజకీయ నాయకుల శృంగార వీడియోల వెనుక ఓ టాప్ సీనియర్ హీరోయిన్ తో పాటు, మరో ఇద్దరు నటీమణులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన నటితో పాటు, ఈమధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో నటించిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీలను హనీట్రాప్ చేశారని, వారితో శృంగారం జరుపుతూ వీడియోలు చిత్రీకరించారని భావిస్తున్న పోలీసులు, ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించే పనిలో ఉన్నారు.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ హీరోయిన్ 25కు పైగా చిత్రాల్లో నటించిందని సమాచారం. మిగతా ఇద్దరిలో ఓ నటి చిన్న సినిమాలు, టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలలో కనిపించగా, మూడో నటి కన్నడతో పాటు ఇతర సినిమాల్లోనూ కనిపించిందట. గత వారం ఈ హనీట్రాప్ వ్యవహారం బయటకు వచ్చింది. చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వీడియోలు బయటకు వచ్చాయి. ఈ కేసులో రాఘవేంద్ర అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

రాఘవేంద్ర, తన ప్రియురాలిని, కొందరు అమ్మాయిలను ఎమ్మెల్యేల వద్దకు పంపి వారితో పరిచయాలు పెంచుకున్నాడని పోలీసులు గుర్తించారు. వారిని రహస్యంగా వీడియోలు తీసి, వారి నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేశాడు. కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటకు వచ్చింది. రాఘవేంద్రను, అతని ప్రియురాలినీ విచారించగా, సినీ హీరోయిన్ల ప్రమేయంపై ఉప్పందినట్టు తెలుస్తోంది.
Karnataka
Honey Trap
Heroins

More Telugu News