Chiranjeevi: బ్యాంకాక్ లో చిరూ మూవీ మ్యూజిక్ సిటింగ్స్

షార్ట్స్‌లో చూడండి
చిరంజీవి 152వ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నెలలోనే ఈ సినిమా షూటింగును ప్రారంభించనున్నారు. అందువలన అన్నిపనులను వేగంగా ఒక కొలిక్కి తీసుకొస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు. ఆయన బ్యాంకాక్ చేరుకుని అక్కడున్న ఓ ప్రైవేట్ రిసార్టులో కొత్త బాణీలపై కసరత్తు చేస్తున్నారు.

చిరంజీవి .. కొరటాల కూడా ఈ పనిపై అక్కడికి చేరుకున్నారని అంటున్నారు. గతంలో చిరంజీవికి మణిశర్మ ఎన్నో హిట్ సాంగ్స్ ఇచ్చి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలపాలనే పట్టుదలతో వున్నాడు. ఇప్పటికే సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. కథానాయికగా 'త్రిష' పేరు వినిపిస్తోంది. మిగతా పాత్రల కోసం నటీనటుల ఎంపికను త్వరలోనే పూర్తి చేయనున్నారు.
Go Back to Shorts
Chiranjeevi
Trisha

More Telugu News