Vijay Sai Reddy: నిధులను చిట్టి నాయుడు సింగపూర్ కు మళ్లించేశాడు.. విచారణ జరుగుతోంది.. ఓపికపట్టు చిట్టీ: విజయసాయి రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 58 కోట్ల రూపాయలను సింగపూరుకు మళ్లించేశాడంటూ ట్వీట్ చేశారు.

'ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన 58 కోట్ల రూపాయలను చిట్టి నాయుడు సింగపూరుకు మళ్లించేశాడు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం యాప్‌ తయారీకి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టాడు. ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నాడు. 58 కోట్ల రూపాయల స్కామ్‌పై విచారణ జరుగుతోంది. ఓపికపట్టు చిట్టీ!' అని విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
Go Back to Shorts
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News