చంద్రబాబు బస్సుపై దాడి ఘటన.. పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతల ఫిర్యాదు

  • దాడి ఘటనపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • తుళ్లూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
  • బాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు ఎలా అనుమతి ఇచ్చారు?
నిన్న అమరావతిలో చంద్రబాబు బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరిన ఘటనపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో కోరారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనలకు అనుమతి ఎలా ఇచ్చారు? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Guntur District
Tullur

More Telugu News