వైసీపీలో చేరిన కారెం శివాజీ... కండువా కప్పిన జగన్!
- వైసీపీలోకి వలసలు
- టీడీపీని వీడి జగన్ పక్షాన చేరిన కారెం శివాజీ
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా
కారెం శివాజీ 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిలో నియమితులయ్యారు. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ గెలవడంతో అనేకమంది నామినేటెడ్ పదవులకు రాజీనామా చేసినా కారెం శివాజీ మాత్రం ఇప్పటివరకు కొనసాగారు. వైసీపీలో చేరాలని నిశ్చయించుకున్న తర్వాతే నిన్న పదవికి రాజీనామా చేశారు.