జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు, కోడలికి హైకోర్టు నోటీసులు
- త్రిశూల్ సిమెంట్ కంపెనీకి సున్నపురాయి మైనింగ్ లీజులో మోసం జరిగిందంటూ కేసు
- 2011లో హైకోర్టులో పిల్ వేసిన మురళీప్రసాద్ రెడ్డి
- గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు
కేసు వివరాల్లోకి వెళ్తే, లైమ్ స్టోన్ మైనింగ్ లీజు కోసం త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందంటూ తాడిపత్రికి చెందిన మురళీప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిల్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న హైకోర్టు గత నెలలో దివాకర్ రెడ్డి సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. తాజాగా ఆయన కుమారుడు, కోడలికి నోటీసులిచ్చింది.