తనను పార్టీకి పిలవలేదని చిరంజీవిపై అలనాటి దర్శకనటుడి అసంతృప్తి
- చిరంజీవి నివాసంలో అలనాటి తారల సమాగమం
- తనను పిలవలేదని ప్రతాప్ పోతన్ ఆవేదన
- తాను అర్హుడ్ని కానేమోనంటూ వ్యాఖ్యలు
అయితే ఈ సంబరాలకు తనను పిలవలేదని ప్రముఖ దర్శకనటుడు ప్రతాప్ పోతన్ ఆవేదన వ్యక్తం చేశారు. "ఆహ్వానం అందుకునేందుకు నేను అర్హుడ్ని కానేమో. నేను ఏమంత గొప్పనటుడ్ని, దర్శకుడ్ని కాదేమో. అందుకే చిరంజీవి గారు నన్ను ఆహ్వానించలేదనిపిస్తోంది. ఏదేమైనా చాలా బాధగా ఉంది. జీవితం అంటే ఇంతే. నేను తీసిన సినిమాలు అందరికీ నచ్చకపోవచ్చు" అని వ్యాఖ్యానించారు.