మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది... అందుకే వాళ్లపై కామెంట్ చేస్తా: వర్మ
Add ap7am to your home Screen

మెగా ఫ్యామిలీ అమెరికా లాంటిది... అందుకే వాళ్లపై కామెంట్ చేస్తా: వర్మ

  • మెగా కుటుంబ సభ్యులు బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అంటూ వ్యాఖ్యలు
  • తన కామెంట్లకు ప్రత్యేకమైన కారణాలు ఉండవని వివరణ
  • చిరంజీవి అంటే ఎంతో గౌరవమని వ్యాఖ్యలు
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మీరు మెగా ఫ్యామిలీపై తరచుగా ఎందుకు స్పందిస్తుంటారని చానల్ ప్రతినిధి ప్రశ్నించగా, అందుకు ప్రత్యేకమైన కారణాలేవీ లేవని వర్మ బదులిచ్చారు. తాను ఎక్కువగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ట్వీట్లు చేస్తుంటానని, ఈ ప్రపంచంలో అగ్రరాజ్యం అంటే అమెరికానే కాబట్టి వాళ్లపైనే తాను స్పందిస్తానని వెల్లడించారు. ఇక్కడ మెగా ఫ్యామిలీ కూడా అమెరికా వంటిదని, అందుకే వాళ్లపై ఎక్కువగా స్పందిస్తుంటానని వివరించారు. అంతేతప్ప మెగా కుటుంబ సభ్యులపై తనకు ఎలాంటి ద్వేషం ఉండదని వర్మ స్పష్టం చేశారు.

"మెగా ఫ్యామిలీ తప్ప మిగతా వాళ్లకు ఆ అర్హత లేదు. ఇక్కడ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్ అంటే మెగా కుటుంబ సభ్యులే. ఎక్కడ ఎవరు బిగ్గెస్ట్ అయితే వాళ్లనే నేను కామెంట్ చేస్తాను. ఆ అర్హత లేని ఇతరులపై నేను కామెంట్ చేయను. మెగాస్టార్ చిరంజీవి అంటే నాకెంతో గౌరవం. పవన్ కల్యాణ్ ని మోస్ట్ సిన్సియర్ అని భావిస్తాను" అంటూ వివరించారు.
Chiranjeevi
RGV
Pawan Kalyan
Mega Family
Tollywood

More Telugu News