Chandrababu: జగన్ ను జైలుకు పంపేందుకు ఢిల్లీలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎవరికీ తెలియవనుకోవద్దు: విజయసాయిపై బుద్ధా వ్యాఖ్యలు

షార్ట్స్‌లో చూడండి
బీజేపీలోకి కోవర్టును పంపి, వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పిస్తున్నది చంద్రబాబేనంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగా స్పందించారు. "అసలు కోవర్టు మీరే. ఆ విషయం తెలుసుకునే లోపే జగన్ గారిని జైలుకు పంపి ఆ సీటు కొట్టేసేందుకు ఢిల్లీలో మీరు చేస్తున్న ప్రయత్నాలు ఎవరికీ తెలియవనుకోవద్దు. మీ వ్యవహారం పిల్లి కళ్లుమూసుకుని పాలుతాగినట్టే ఉంది విజయసాయిరెడ్డి గారూ. 22 మంది ఎంపీలను అనుమానిస్తున్న జగన్ గారికి అసలు ప్రమాదం మీరేనన్న విషయం ఇంకా అర్థమైనట్టు లేదు" అంటూ ట్విట్టర్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
Vijay Sai Reddy
YSRCP
Budda Venkanna

More Telugu News