'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ ట్రెండింగ్ నం.1 అంటూ.. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేసిన వర్మ
Add ap7am to your home Screen

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' ట్రైలర్ ట్రెండింగ్ నం.1 అంటూ.. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను ట్యాగ్ చేసిన వర్మ

  • నిన్న విడుదలైన ట్రైలర్ 2
  • 3 మిలియన్ల వ్యూస్
  • సినిమాపై ఆసక్తిని రేపుతోన్న ట్రైలర్లు, పోస్టర్లు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలోంచి ట్రైలర్- 2 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇది యూట్యూబ్ లో ట్రెండింగ్ నంబరు 1లో ఉందంటూ ఆయన ఈ రోజు ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ ట్రైలర్ కు మూడు మిలియన్ల వ్యూస్ వచ్చాయని చెప్పారు. నిన్న ఉదయం 9.36 గంటలకు ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్- 2 విడుదల చేశారు.  

సినిమా టైటిల్ తోనే వివాదం రేపిన రామ్ గోపాల్ వర్మ... ఈ చిత్రానికి సంబంధించి మొదటి ట్రైలర్ తో మరింత వేడి పుట్టించారు. తాజాగా రెండో ట్రైలర్ అంటూ మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. అప్పుడప్పుడు ఈ సినిమాలో పలు ఆసక్తికర పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తి రేపుతున్నారు. ఏపీ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా రూపొందింది. 
RGV
Chandrababu
Pawan Kalyan
Jagan

More Telugu News