వాట్సాప్ యూజర్లను అప్రమత్తం చేస్తున్న భారత ఆర్మీ!
- వాట్సాప్ గ్రూపులపై హ్యాకర్ల కన్ను
- భద్రత బలగాల గ్రూపులే లక్ష్యంగా కార్యకలాపాలు
- +86తో మొదలయ్యే నంబర్లు ప్రమాదకరం అంటున్న ఆర్మీ
అందుకే వాట్సాప్ గ్రూపుల విషయంలో ఆర్మీ జవాన్లు, సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గ్రూపుల్లో అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయకుండా గ్రూప్ అడ్మిన్స్ కు సమాచారం అందించాలని సూచించింది. గుర్తుతెలియని ఫోన్ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్ ల విషయంలోనూ జాగరూకత వహించాలని, ముఖ్యంగా +86తో ప్రారంభమయ్యే నంబర్లు మరింత ప్రమాదకరం అని ఆర్మీ నిఘావర్గాలు హెచ్చరించాయి. ఈ తరహా నంబర్లతో ఏకంగా ఆర్మీ అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి కీలక సమాచారం తస్కరించే ప్రయత్నం చేశారని వివరించాయి.