ఇది మా సంస్కారమంటూ.. జగన్ విమర్శలపై జనసేన వీడియో రిలీజ్
- జగన్మోహన్ రెడ్డి బాధ్యతా రహితంగా మాట్లాడారు
- అంతకంటే నేను బలంగా విమర్శించగలను
- వారి కుటుంబం గుర్తుకువచ్చి ఆ పని చేయలేకపోతున్నా
ఆంధ్రప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వ విద్యా విధానంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. సీఎం జగన్ ఆయన తీరును తీవ్ర స్వరంతో దుయ్యబట్టారు. మీకు ముగ్గురు భార్యలున్నారు. వారికి నలుగురో ఐదుగురో పిల్లలుండొచ్చు వారినందరిని ఏ మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత సహా పార్టీ నేతలు భగ్గుమన్నారు.
‘ఇదీ మా సంస్కారం’ అంటూ గతంలో జగన్ ను విమర్శిస్తూ పవన్ గతంలో మాట్లాడిన వీడియోను జనసేన శ్రేణులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘జగన్మోహన్ రెడ్డి అలా తిడుతుంటే నేను కూడా బలంగా తిట్టగలను. జగన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు నేను మాట్లాడలేను. వారి పిల్లలు, కుటుంబ సభ్యులు గుర్తొస్తారు’ అని పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ వీడియోలో ఉన్నాయి.