తమిళ హీరో విజయ్ ఇంటివద్ద బాంబు పెట్టారని ఫోన్ కాల్
Add ap7am to your home Screen

తమిళ హీరో విజయ్ ఇంటివద్ద బాంబు పెట్టారని ఫోన్ కాల్

  • శాలిగ్రాంలో ఉన్న ఇంట్లో హీరో తల్లిదండ్రుల నివాసం
  • ఈస్ట్ కోస్ట్ రోడ్ లో ఉన్న ఇంట్లో భార్య, పిల్లలతో విజయ్ 
  • రెండు చోట్ల భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
హీరో విజయ్ ఇంటివద్ద బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలోని శాలిగ్రామంలో ఉన్న విజయ్ ఇంటివద్ద బాంబు పెట్టారని, అది కొన్నిగంటల్లో పేలుతుందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో శాలిగ్రాంలో ని విజయ్ ఇంటిలో ఉంటున్న ఆయన తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభను పోలీసులు కలిసి అప్రమత్తం చేసి భద్రత పెంచారని సమాచారం.

ఆగంతుకుని ఫోన్ కాల్ పై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పోరూర్ సమీపంలోని అలప్పక్కంకు చెందిన ఓ యువకుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు  చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ మార్గంలోని ఇంట్లో  విజయ్, తన భార్య సంగీత, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నారు. వారికి కూడా బాంబు బెదిరింపు కాల్ విషయం తెలియజేసి అప్రమత్తం చేశామన్నారు. ఇక్కడ కూడా పోలీసుల సంఖ్యను పెంచి భద్రతను కట్టుదిట్టం చేశామని అధికారులు తెలిపారు.
Vijay
Tamilnadu
Kollywood
Chennai

More Telugu News