చిరంజీవి అధికారంలోకి రాకపోవడం వల్లే పవన్ కల్యాణ్ 'ప్రజారాజ్యం'కు దూరమయ్యాడు: ఏపీ మంత్రి వెల్లంపల్లి
- పవన్ పై వెల్లంపల్లి విమర్శలు
- ఇసుక అంశంలో జగన్ పై విమర్శలు సరికాదని హితవు
- నదులు పొంగిపొర్లుతుంటే ఇసుక ఎలా తవ్వుతారన్న వెల్లంపల్లి
ఇసుక అంశంలో పవన్ వ్యాఖ్యలు అర్థరహితమని, ఓవైపు నదులు పొంగిపొర్లుతుంటే ఇసుక ఎలా తవ్వుతారని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. పవన్ ఓసారి విజయవాడ ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చి చూడాలని, వరద పోటెత్తుతోందని తెలిపారు. వెల్లంపల్లి గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యే అన్న సంగతి తెలిసిందే.