మీ వాడు మగాడో, కాదో నువ్వే తేల్చుకో: విజయసాయిరెడ్డిపై బుద్ధా వెంకన్న ఫైర్

  • జగన్ తిన్న తిండిని లోకేశ్ కు అంటగడతారా?
  • ఆధారాలను లోకేశ్ మగాడిలా బయటపెట్టారు
  • చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లకా లోకేశ్ గురించి మాట్లాడేది?
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టులో జగన్ తిన్న తిండిని లోకేశ్ కు అంటగడతారా? అని మండిపడ్డారు. మీ దొంగ పత్రిక రాసిన వార్తలో ఉన్న తేదీల్లో ఎక్కడ ఉన్నాడో లోకేశ్ మగాడిలా బయటపెట్టారని చెప్పారు. మీ వాడు మగాడో, కాదో నువ్వే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.

ప్రజాధనాన్ని పందికొక్కులా తిని, అది అరగక, చిప్పకూడు తిన్న నువ్వు, మీ తుగ్లక్ ముఖ్యమంత్రా లోకేశ్ గురించి మాట్లాడేది? అంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీది మనిషి పుట్టుకే అయితే... మీ దొంగ పత్రిక రాసిన వార్తకు ఆధారాలను చూపించాలంటూ సవాల్ విసిరారు.

'మీ వాడు ఆరు నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాడన్నావ్. కానీ మీ వాడు రాష్ట్రాన్ని ముంచే ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు దమ్ముంటే తుగ్లక్ ముఖ్యమంత్రి జగన్ తో రాజీనామా చేయించి రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పోటీ చేయించు. ప్రజలు ఎవరిని తిరిగి కోరుకుంటారో తేలిపోతుంది' అంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Budda Venkanna
Jagan
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News