కోట్ల రూపాయలు దోచుకున్న దేవినేని ఉమ కొవ్వు పట్టి మాట్లాడుతున్నారు: ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- రివర్స్ టెండరింగ్ ను ‘రియాల్టీ షో’ అంటారా?
- నాడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా దేవినేని విఫలం
- ‘రివర్స్’తో వెయ్యికోట్లు ఆదా చేసింది దేవినేనికి కనబడట్లేదా?
చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని పట్టించుకున్న పాపానపోలేదు
మాజీ సీఎం చంద్రబాబునాయుడుపైనా ఆయన మండిపడ్డారు. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ, నాడు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి జగన్ పై కేసులు బనాయించాలని కోరారు తప్పితే, రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపానపోలేదని దుమ్మెత్తిపోశారు. జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసిన ప్రతీసారి, ప్రత్యేక హోదా అంశం, నిధుల గురించి ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈరోజు జగన్ మాట్లాడింది కూడా ఈ విషయాలేనని స్పష్టం చేశారు.