రైతు భరోసా జాబితాలో శిద్ధా రాఘవరావు పేరు... కలెక్టర్ కు లేఖ రాసిన మాజీ మంత్రి
- చీమకుర్తి పరిధి లబ్దిదారుల జాబితాలో పేరు
- అభ్యంతరం వ్యక్తం చేసిన శిద్ధా
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్ కు లేఖ
రైతు భరోసా లబ్దిదారుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఆయన ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కు లేఖ రాశారు. చీమకుర్తి పరిధి లబ్దిదారుల జాబితాలో తన పేరు ఉండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తన లేఖలో కలెక్టర్ ను కోరారు.