Uttar Pradesh: యూపీలో బీజేపీ నేత కాల్చివేత.. వారం వ్యవధిలో ముగ్గురి హత్య

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌ జిల్లా దేవ్‌బంద్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్ ధారాసింగ్ (47) దారుణ హత్యకు గురయ్యారు. ద్విచక్ర వాహనాలపై వచ్చిన దుండగులు ఆయనను అత్యంత సమీపం నుంచి తుపాకితో కాల్చి చంపారు. ధారాసింగ్ స్థానికంగా ఉండే ఓ షుగర్ ఫ్యాక్టరీలో సెక్టార్ ఇన్‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఆయన హత్యకు గల కారణాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, యూపీలో బీజేపీ నేతలు వరుస హత్యలకు గురవుతున్నారు. ధారాసింగ్ హత్య ఈ వారంలోనే మూడోది కావడం గమనార్హం.
Go Back to Shorts
Uttar Pradesh
saharanpur
BJP
shot dead

More Telugu News