గౌతమ్ గంభీర్ కెరీర్ ముగిసిపోవడానికి నేనే కారణం: పాకిస్థాన్ బౌలర్ మొహమ్మద్ ఇర్ఫాన్
- నా బౌలింగ్ ఎదుర్కోవడానికి గంభీర్ భయపడ్డాడు
- కళ్లలోకి కళ్లు పెట్టి కూడా చూడలేకపోయాడు
- నా ఫుల్ లెంగ్త్ బంతులకు ఔట్ అయ్యేవాడు
తన ఫుల్ లెంగ్త్ బంతులకు గంభీర్ ఔట్ అయ్యేవాడని... తన షార్ట్ పిచ్ బంతులను పుల్ చేయాలనుకున్న ప్రయత్నాలు కూడా ఫలించలేదని ఇర్ఫాన్ తెలిపాడు. ఆ టూర్ లో తన బౌలింగ్ లో గంభీర్ మూడు సార్లు ఔటయ్యాడని చెప్పాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో కూడా తన కళ్లలోకి చూడలేకపోయేవాడని... ఎవరైనా ఎవరికైనా భయపడినప్పుడు వారి కళ్లలోకి చూడరని, పక్కకు తప్పుకుని వెళ్లిపోతుంటారని తెలిపాడు.
ఆ సిరీస్ లో తన బౌలింగ్ కు భారత బ్యాట్స్ మెన్ ఇబ్బంది పడ్డారని... ఈ విషయాన్ని స్వయంగా వారే తనతో చెప్పారని ఇర్ఫాన్ అన్నాడు. వేగవంతమైన తన బంతులను భారత బ్యాట్స్ మెన్ సరిగా చూడలేకపోయారని తెలిపాడు.