యురేనియం డ్రిల్లింగ్ పనుల గురించి ఏపీ ప్రభుత్వానికి తెలియదా?: పవన్ కల్యాణ్
- ఆళ్ళగడ్డలో యురేనియం డ్రిల్లింగ్ పనులు
- దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్
- ఈ విషయమై ఏపీ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి
ఈ విషయం గురించి కర్నూలు జిల్లా కలెక్టర్ కు తెలియకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అన్నారు. నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రజలకు మద్దతు ఇచ్చేందుకు, వారితో కలిసి పోరాడేందుకు తాము ఉన్నామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా నల్లమల అటవీ ప్రాంత పరిరక్షణ కోసం విమలక్క పాడిన పాట వీడియోతో పాటు యురేనియం డ్రిల్లింగ్ పనులకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ పాట ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.