Chandrababu: చంద్రబాబు ‘మ్యావ్’ అంటే ‘గర్జించారు’ అని ఎల్లోమీడియా రాస్తోంది: అంబటి రాంబాబు

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విషం కక్కుతుంటే, ఎల్లో మీడియా ఆయనకు వంతపాడుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం నాలుగు నెలల వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారని, ‘ఇది కాలకేయ ప్రభుత్వమని, రాక్షస ప్రభుత్వమని, పోలీసులు చెప్పు చేతల్లో లేరని’ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇలాంటి మాటలు మాట్లాడి ప్రజలను నమ్మించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. నాలుగు మాసాలు అధికారంలో లేకపోయే సరికి తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ లు విలపిస్తున్నారని, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని, ఆ ట్వీట్లను కొన్ని పత్రికలు పెద్దగా రాస్తున్నాయని విమర్శించారు. ‘చంద్రబాబు ‘మ్యావ్’ అంటే.. ‘చంద్రబాబు విరుచుకుపడ్డారు.. గర్జించారు’ అని రాసి తద్వారా ప్రజలకు ఏదో సంకేతం పంపించాలని చూస్తున్నాయి’ అని విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Telugudesam
YSRCP
Ambati rambabu

More Telugu News