టాలీవుడ్లో వారసులపై సమంత వ్యాఖ్యలు మరోసారి వైరల్
- టాలీవుడ్లో నెపోటిజంపై సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం
- వారసులైనా, బయటివారైనా అందరికీ వారి సొంత సవాళ్లు ఉంటాయని వెల్లడి
- స్టార్ కిడ్స్ ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొంటారని, వారి వైఫల్యం అందరికీ తెలుస్తుందని వ్యాఖ్య
- సినిమా భవిష్యత్తు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం
సినీ పరిశ్రమలో తరచుగా వినిపించే 'నెపోటిజం' (వారసత్వం)పై స్టార్ హీరోయిన్ సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. పరిశ్రమలో వారసులైనా, బయటి నుంచి వచ్చినా ప్రతి ఒక్కరికీ వారి సొంత సవాళ్లు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్'లో సమంత తొలిసారి పాల్గొన్నప్పుడు, హోస్ట్ కరణ్ జోహార్ ఆమెను నెపోటిజంపై ప్రశ్నించారు. "తెలుగు పరిశ్రమలో హీరోల కొడుకులు, మేనల్లుళ్లు సులభంగా హీరోలవుతారు. విజయ్ దేవరకొండ లాంటి కొద్దిమంది మాత్రమే బయటి నుంచి వచ్చి నిలదొక్కుకున్నారు. దీనిపై మీరేమంటారు?" అని అడిగారు.
దీనికి సమంత స్పందిస్తూ.. "వారసులు అయినా, బయటి నుంచి వచ్చిన వాళ్లయినా ప్రతి ఒక్కరికీ వారి సొంత సమస్యలు ఉంటాయి. అందరూ వాటిని ఎదుర్కోవాల్సిందే" అని అన్నారు. స్టార్ కిడ్స్‌కు కెరీర్ ఆరంభంలోనే ఒక అడ్వాంటేజ్ ఉంటుందన్న వాదనపైనా ఆమె మాట్లాడారు. సినీ కుటుంబం నుంచి వచ్చిన వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని, వారి ప్రతి కదలికను ప్రేక్షకులు, పరిశ్రమ గమనిస్తుండడం జరుగుతుందని చెప్పారు.
"నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఫెయిల్ అయితే, ఆ విషయం మా అమ్మానాన్నలకు, సోదరులకు మాత్రమే తెలిసేది. కానీ, ఒక స్టార్ కిడ్ ఫెయిల్ అయితే ఆ విషయం దేశం మొత్తానికి తెలుస్తుంది" అని సమంత వివరించారు. చివరకు అంతా ప్రేక్షకుల ఆదరణ మీదే ఆధారపడి ఉంటుందని, అంతిమ నిర్ణయం ఎప్పుడూ వారి చేతుల్లోనే ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.
2010లో 'ఏ మాయ చేసావె' చిత్రంతో అరంగేట్రం చేసిన సమంత.. దూకుడు, రంగస్థలం వంటి అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలతో అగ్ర కథానాయికగా ఎదిగారు. ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.