Jansena: అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ.. దొందూ దొందే: ‘జనసేన’ సెటైర్లు

షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వంపై జనసేన పార్టీ  సెటైర్లు విసిరింది. నాటి, నేటి ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలో ప్రజాధనం వృథా అయిందని, అవే డబ్బా ప్రచారాలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేసింది.

‘అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ’ అంటూ రెండు రక్షిత మంచినీటి పథకం ట్యాంకుల ఫొటోలను పోస్ట్ చేసింది. ఇందులో ఒక ట్యాంక్ కు పసుపు రంగు.. మరో ట్యాంక్ కు నీలం, తెలుపు, ఆకుపచ్చ రంగులు వేసి ఉండటం స్పష్టంగా కనపడుతుంది. ‘అవే డబ్బా ప్రచారాలు, ప్రజాధనంతో రంగులు వేసుకోవడాలు’, ‘దొందూ దొందే’ అని ఆయా పార్టీలను విమర్శించారు.
Go Back to Shorts
Jansena
Telugudesam
YSRCP

More Telugu News