పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కూడా తెలియని ఓ విషయం చెబుతా వినండి: అల్లు అరవింద్
- హైదరాబాద్ లో సైరా ప్రీరిలీజ్ వేడుక
- హాజరైన సినీ ప్రముఖులు
- సైరా చిత్రానికి తానే మొదటి ప్రేక్షకుడ్నని చెప్పిన అరవింద్
సినిమా చూసి కిందపడిపోయానని, వెంటనే చిరంజీవిని హత్తుకుని సంతోషం వ్యక్తం చేశానని వివరించారు. సైరా సూపర్ హిట్ అని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అయితే, చిరంజీవితో ఎన్నో సినిమాలు చేసిన తాను ఇలాంటి సినిమా చేయలేకపోయానని బాధపడుతున్నానని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఆ అవకాశం రామ్ చరణ్ కు దక్కిందని అన్నారు.