పవన్ ఆగ్రహానికి దిగి వచ్చిన ట్విట్టర్!
- 400 మంది జనసేన కార్యకర్తల అకౌంట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్
- ప్రజల తరపున నిలబడితే ఖాతాలను సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించిన పవన్
- సస్పెండ్ చేసిన ఖాతాలను పునరుద్ధరించిన ట్విట్టర్
ఈ నేపథ్యంలో ట్విట్టర్ కు పవన్ ధన్యవాదాలు తెలిపారు. 'వాక్ స్వాతంత్ర్య హక్కును గౌరవించినందుకు, జనసేన కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను పునరుద్ధరించే విషయంలో వేగంగా ప్రతిస్పందించినందుకు ట్విట్టర్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నా' అంటూ ట్వీట్ చేశారు.