పూజా హెగ్డే నడుము మీద చెర్రీ పండుతో కొడతాను: రాఘవేంద్రరావు చమత్కారం
- 'వాల్మీకి' కోసం సాంగ్ రీమిక్స్
- పాటను విడుదల చేసిన రాఘవేంద్రరావు
- వాడిన బిందెల నిండా డబ్బు రావాలన్న దర్శకేంద్రుడు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోజు పాట చిత్రీకరణ నిమిత్తం 1000 బిందెలను వాడామని, ఇప్పుడు సినిమా కోసం వాడినన్ని బిందెల నిండా డబ్బులు నిర్మాతలకు చేరాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇక 'దేవత' గురించిన వివరాలు చెబుతూ, ఈ సినిమా పాట చిత్రీకరణ నిమిత్తం ఉండ్రాజవరంలో ఉన్న సమయంలో, రాత్రి పడుకుని పాటను ఎలా తీయాలని ఆలోచిస్తుండగా, ఎక్కడి నుంచో 'ఠంగ్ ఠంగ్' మంటూ శబ్దం వినిపించిందని, ఏంటని అడిగితే, పక్క ఊళ్లో ఇత్తడి బిందెలు తయారు చేస్తారని చెప్పగా, పాటను ఆ బిందెల నేపథ్యంలో తీయాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. కాగా, ఈ శుక్రవారం 'వాల్మీకి' చిత్రం విడుదల కానుంది.