Andhra Pradesh: ఏపీలో కాంట్రాక్టర్లకు జగన్ సర్కారు షాక్.. రూ.1,000 కోట్ల రహదారి పనులు నిలిపివేత!

షార్ట్స్‌లో చూడండి
ఇప్పటికే పోలవరం కాంట్రాక్టును రద్దుచేసిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పంచాయతీరాజ్ శాఖలో భారీస్థాయిలో జరుగుతున్న 3,543 రహదారి పనులను నిలిపివేయాలని ఆదేశాలు జారీచేసింది. ఈ పనుల విలువ రూ.1,031.17 కోట్లుగా ఉందని సమాచారం. పంచాయతీరాజ్ తో పాటు ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక కింద చేపడుతున్న పనులను జగన్ సర్కారు నిలిపివేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 2018, ఏప్రిల్ కు ముందే అనుమతి పొందినప్పటికీ ఇంకా పనులు ప్రారంభించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
Go Back to Shorts
Andhra Pradesh
Panchayat roads works
Stopped
RS.1000 crores
Jagan

More Telugu News