నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత... మరోసారి ఉండవల్లి కరకట్టకు ముప్పు!
- 16 గేట్లను ఎత్తిన అధికారులు
- దిగువకు 1.50 లక్షల క్యూసెక్కుల నీరు
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
కాగా, ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 80 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, నేటి సాయంత్రానికి అది 3 లక్షల క్యూసెక్కులను దాటే ప్రమాదం ఉండటంతో, ఉండవల్లి కరకట్ట మరోసారి ముంపు ప్రమాదంలో చిక్కుకుంది. వరదను దృష్టిలో ఉంచుకుని, భవానీ ద్వీపానికి యాత్రికుల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గత నెలలో కృష్ణానదికి భారీ వరద వచ్చిన వేళ, కరకట్టపైనే ఉన్న చంద్రబాబు నివాసం మెట్ల వరకూ నీరు వెళ్లిన సంగతి తెలిసిందే.