నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు.. టీ20ల్లో శ్రీలంక బౌలర్ మలింగ ప్రపంచ రికార్డు
- ఈ ఫీట్ సాధించడం మలింగకు ఇది రెండోసారి
- అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదుసార్లు హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి బౌలర్‌గా కీర్తి
- టీ20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. అనంతరం 126 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్.. మలింగ బంతులకు విలవిల్లాడింది. మూడో ఓవర్ మూడో బంతికి మన్రోను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న మలింగ ఆ తర్వాత వరుసగా రూథర్‌ఫోర్డ్, గ్రాండ్‌హోమ్, టేలర్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఎనిమిది మంది ఆటగాళ్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. దీంతో 16 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలి 37 పరుగుల తేడాతో కివీస్ ఓటమి పాలైంది. అయితే, సిరీస్ మాత్రం 2-1తో కివీస్ సొంతం చేసుకుంది.