Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినిమా టైటిల్ ఇదే

షార్ట్స్‌లో చూడండి
చిత్రపరిశ్రమలో హీరోలుగా ఎదిగిన తరువాత .. కొంత మొత్తం వెనకేసుకున్న తరువాత .. కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారడం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ ఈ విషయంలోను తనదైన దూకుడు చూపించాడు. హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చాలా తక్కువ కాలంలోనే ఆయన నిర్మాతగా మారిపోయాడు. 'కింగ్ ఆఫ్ ది హిల్' బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని, ఒక సినిమాను నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. హీరో .. హీరోయిన్ అని కాకుండా, ప్రధాన పాత్రల కలయికగా కనిపిస్తుంది. తరుణ్ భాస్కర్ .. అనసూయ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'మీకు మాత్రమే చెప్తా' అనే టైటిల్ ను సెట్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Go Back to Shorts
Vijay Devarakonda

More Telugu News