నేను పాకిస్థాన్ వెళ్లకుండా ఆపగలరా? మీకా దమ్ముందా?: సవాల్ విసిరిన నటి శిల్పా షిండే
- పాక్ లో మికా సింగ్ ప్రదర్శనపై సినీ సంఘాల ఆగ్రహం
- సినీ సంఘాల తీరును తప్పుబట్టిన శిల్పా షిండే
- సినీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టాలంటూ హితవు
సినీ సంఘాలు అనేక సమస్యలను వదిలిపెట్టి మికా వ్యవహారంపై దృష్టిపెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. షూటింగ్ ల సందర్భంగా కార్మికులు నిత్యం 12 నుంచి 15 గంటల వరకు పనిచేస్తున్నారని, వారికి 8 గంటల పనివేళలను నిర్ధారించడంపై శ్రద్ధ చూపాలని హితవు పలికింది. దేశంపై ప్రేమ ఉంటే ఆర్మీలో చేరాలని, తాను పాకిస్థాన్ వెళ్లాలనుకుంటే ఆపే దమ్మెవరికైనా ఉందా అంటూ ప్రశ్నించింది.