అభినందన్ ను పట్టుకున్న అహ్మద్ ఖాన్ హతం... ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టిన ఇండియన్ ఆర్మీ
- విమానం కూలిపోయిన ఘటనలో అభినందన్ ను బంధించిన అహ్మద్ ఖాన్
- పాక్ ఆర్మీలో స్పెషల్ కమాండోగా పనిచేస్తున్న అహ్మద్ ఖాన్
- ఉగ్రవాదులను భారత్ లో ప్రవేశపెట్టడంలో స్పెషలిస్ట్ గా గుర్తింపు!
ఉగ్రవాదులను భారత్ లోకి పంపించేందుకు ప్రయత్నించే క్రమంలో అహ్మద్ ఖాన్ హతుడయ్యాడు. చొరబాట్లు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన భారత బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లోనే అహ్మద్ ఖాన్ మృతి చెందాడు. పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులను భారత్ లోకి పంపించడంలో అహ్మద్ ఖాన్ ఇప్పటివరకు కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది.