బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారు!

  • డిసెంబర్ 31న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
  • ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడి ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీనే అన్న నడ్డా
  • ఇతర పార్టీలు వారసుల కోసం ఆరాటపడుతుంటాయని ఎద్దేవా
భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 31న పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తెలిపారు. సెప్టెంబర్ లో 8 లక్షల బూత్ లకు ఎన్నికలు జరుగుతాయని... అక్టోబర్ లో మండల స్థాయి ఎన్నికలు, నవంబర్ లో జిల్లా స్థాయి ఎన్నికలు, డిసెంబర్ 15న రాష్ట్ర స్థాయి ఎన్నికలు జరుగుతాయని... చివరగా డిసెంబర్ 31న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్య పద్ధతిలో అధ్యక్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక పార్టీ బీజేపీనే అని తెలిపారు. సాధారణ స్థాయి నుంచి వచ్చిన మోదీ ప్రధాని అయ్యారని, అమిత్ షా జాతీయ అధ్యక్షుడు అయ్యారని... ఒక బీజేపీలోనే ఇది సాధ్యమని చెప్పారు. తమ కుమారులు, కుమార్తెల కోసం ఇతర పార్టీలు ఆరాటపడుతుంటాయని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
BJP
President
Election
JP Nadda
Modi
Amit Shah

More Telugu News