పాకిస్థాన్‌లో ప్రదర్శన ఇచ్చినందుకు క్షమాపణలు చెప్పిన భారత సింగర్ మికా సింగ్
- పర్వేజ్ ముషారఫ్ బంధువు పెళ్లిలో మికా సింగ్ ప్రదర్శన
- ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నడుమ ప్రదర్శన ఇవ్వడంపై ఆగ్రహావేశాలు
- తాను చేసింది తప్పేనన్న మికా సింగ్
కరాచీలో పాక్ మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కజిన్ కుమార్తెకు సంబంధించిన పెళ్లి వేడుకలో మికా సింగ్ ప్రదర్శన ఇవ్వడం తమను బాధించిందని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ పేర్కొంది. తనపై నిషేధం విధించిన నేపథ్యంలో ఆదివారం మికాసింగ్ ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
అందులో ఫెడరేషన్ అధ్యక్షుడు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. మికా నుంచి ఓ లేఖ అందిందని పేర్కొన్నారు. తనపై ఫెడరేషన్ తీసుకున్న చర్యలను అంగీకరిస్తున్నట్టు మికా పేర్కొన్నాడని తివారీ తెలిపారు. తాను తప్పు చేశానని, అందుకు ఈ దేశానికి క్షమాపణలు చెబుతున్నానని మికా పేర్కొన్నట్టు తివారీ వివరించారు. అయితే, తన వాదన వినకుండా తనపై నిషేధం విధించొద్దని మికా ఆ లేఖలో పేర్కొన్నట్టు తివారీ పేర్కొన్నారు.