Andhra Pradesh: కరకట్ట ఇల్లు మునగడం, మీరు హైదరాబాద్ కు పారిపోవడమే దేవుడు రాసిన అసలైన స్క్రిప్టు!: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి కౌంటర్

షార్ట్స్‌లో చూడండి
అమరావతిని భ్రమరావతి అన్న ముఖ్యమంత్రి జగన్ చేతే దేవుడు అక్కడ లైటింగ్ పెట్టించాడనీ, దేవుడు భలే స్క్రిప్ట్ రాశాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. భ్రమరావతిలోని నాలుగు భవనాలకు స్వాతంత్ర్య దినోత్సవం రోజూ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఇంతలా ఎందుకు మురిసిపోతున్నారని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ లైటింగ్ అన్నది అసలు స్క్రిప్టే కాదనీ, కరకట్ట మీద నివాసం మునిగిపోవడం,  చంద్రబాబు హైదరాబాద్ కు పారిపోవడమే దేవుడు రాసిన అసలైన స్క్రిప్టని విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Chandrababu
Vijay Sai Reddy
Telugudesam
YSRCP
amaravati
bhramaravati
counter
Twitter

More Telugu News