నాగార్జున సాగర్ బయలుదేరిన ఏపీ, టీఎస్ మంత్రులు... నేడే నీటి విడుదల!
- రైతులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వాలు
- నేడు కుడి, ఎడమ కాలువలకు నీరు
- ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద
నేటి సాయంత్రం ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుడి కాలువకు, తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి ఎడమ కాలువకు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఇంకో 30 అడుగుల మేరకు సాగర్ జలాశయాన్ని పెంచితే, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కొండల మధ్యలో నుంచి సాగే లాంచ్ యాత్రను తిరిగి ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు.