విజయ్ దేవరకొండతో సినిమా .. పూరి షరతులు?
Add ap7am to your home Screen

విజయ్ దేవరకొండతో సినిమా .. పూరి షరతులు?

  • పూరి నెక్స్ట్ మూవీ హీరో విజయ్ దేవరకొండ
  • ముందుకు వచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ 
  • ఈ విషయంపై రేపు రానున్న స్పష్టత  
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్ కొట్టేసిన పూరి జగన్నాథ్ ఫుల్ జోష్ తో వున్నాడు. సాధ్యమైనంత త్వరగా తదుపరి సినిమాను పట్టాలెక్కించే పనిలో వున్నాడు. ఆయన తదుపరి సినిమా హీరో విజయ్ దేవరకొండనే అనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. పూరితో సినిమా చేయడానికి విజయ్ దేవరకొండ కూడా ఉత్సాహాన్ని చూపుతున్నాడట. 

ఈ కాంబినేషన్లో సినిమా అంటే ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అందువలన తాము నిర్మిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ వారు ముందుకు వచ్చారట. అయితే నిర్మాణ భాగస్వామిగా తమ బ్యానర్ ఉంటుందనీ, నిర్మాణ వ్యవహారాలన్నీ చార్మీ చూసుకుంటుందని పూరి షరతులు పెట్టాడట. మరి మైత్రీ వాళ్లు అందుకు అంగీకరిస్తారా? పూరి మరో నిర్మాతను కలుపుకుంటాడా? అనేది రేపు తేలిపోతుందని చెప్పుకుంటున్నారు. క్రాంతిమాధవ్ తో చేస్తోన్న సినిమా పూర్తికాగానే విజయ్ దేవరకొండ పూరి ప్రాజెక్టుకి వచ్చేస్తాడని అంటున్నారు. 
Puri
Vijay Devarakonda

More Telugu News