Raja Raveendra: నా బలహీనత కారణంగానే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు: నటుడు రాజా రవీంద్ర
- నేను కెరియర్ ను సీరియస్ గా తీసుకోలేదు
- రెగ్యులర్ గా టచ్ లో ఉండటం అలవాటు లేదు
- ఎవరినీ అవకాశాలు అడగలేనన్న రాజా రవీంద్ర
తెలుగులో రాజా రవీంద్ర విభిన్నమైన పాత్రలను చేసి మెప్పించాడు. అయితే ఆయన టాలెంట్ కి తగిన అవకాశాలు రాలేదనీ, ఆశించిన స్థాయికి ఆయన చేరుకోలేకపోయారనే టాక్ వుంది. తాజా ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర ఈ విషయంపై స్పందించాడు.
"ఇండస్ట్రీలో నటుడిగా ఎదగడానికి అందరితోనూ టచ్ లో ఉంటూ ఉండాలి. ఫలానా పాత్ర నేను చేస్తాననీ .. ఫలానా అవకాశం నాకు ఇవ్వండి అని అడుగుతూ ఉండాలి. నాకు అలాంటి అలవాటు లేదు .. అదే మైనస్ అయింది. నాలోని ఈ బలహీనత కారణంగానే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. నేను కెరియర్ ను సీరియస్ గా తీసుకోకపోవడం కూడా ఒక కారణమే. ఇక ఇప్పుడు కొంతమంది హీరోలకి మేనేజర్ గా పనిచేస్తున్నాను. అందువలన మిగతా హీరోల సినిమాల్లో అవకాశాలు కూడా పోగొట్టుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.