రజనీ, విజయ్ ల గురించి నేను అలా మాట్లాడి వుండకూడదు: తమిళ దర్శకుడు రాజు మురుగన్ పశ్చాత్తాపం
Add ap7am to your home Screen

రజనీ, విజయ్ ల గురించి నేను అలా మాట్లాడి వుండకూడదు: తమిళ దర్శకుడు రాజు మురుగన్ పశ్చాత్తాపం

  • తమిళనాట రజనీ, విజయ్ లకు విపరీతమైన క్రేజ్ 
  • రాజు మురుగన్ వ్యాఖ్యల పట్ల అభిమానుల అసహనం
  •  క్షమాపణలు చెప్పిన దర్శకుడు
తమిళనాట రజనీకాంత్ కి గల క్రేజ్ .. విజయ్ కి గల ఇమేజ్ ను గురించి తెలిసిందే. సీనియర్ హీరోగా రజనీకాంత్ .. స్టార్ డమ్ కలిగిన విజయ్ బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ఇద్దరికీ లక్షల సంఖ్యలో అభిమానులు వున్నారు. అలాంటి స్టార్ హీరోలను కామెంట్ చేసి ఇబ్బందుల్లో పడ్డాడు తమిళ దర్శకుడు రాజు మురుగన్.

ఆయన దర్శకత్వం వహించిన 'జిప్సీ' సినిమాకి సంబంధించిన ఆడియో వేడుక రీసెంట్ గా జరిగింది. ఈ వేదికపై రాజు మురుగన్ మాట్లాడుతూ .. "హీరోలకు సూపర్ స్టార్ .. తళపతి అనే ట్యాగులు ఉంటాయి. అదే సినిమాలో చేసిన హీరోయిన్స్ కి మాత్రం అలాంటి ట్యాగులు వుండవు ఎందుకని?" అంటూ ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఆయన మాటలు వివాదాస్పదంగా మారాయి. రజనీ .. విజయ్ అభిమానుల నుంచి తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. దాంతో రాజు మురుగన్ తన మాటలను వెనక్కి తీసుకుంటూ, "రజనీ .. విజయ్ ల పట్ల నాకు ఎంతో గౌరవం వుంది. తమిళ చిత్రపరిశ్రమకి వాళ్లు చేస్తున్న సేవ గురించి కూడా నాకు తెలుసు. అలాంటి వాళ్ల గురించి నేను అలా మాట్లాడి వుండకూడదు. వాళ్లిద్దరి అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతున్నాను" అన్నాడు. 
Rajani
Vijay

More Telugu News