Pawan Kalyan: నేటి నుంచి వరుస సమావేశాలను నిర్వహించనున్న పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
పార్టీ బలోపేతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఇప్పటికే జనసేన పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీల బాధ్యతలను ఆయన సీనియర్ నేతలకు అప్పగించారు. ఈరోజు నుంచి పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కమిటీలు, నేతలతో ఆయన సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీని బలోపేతం చేసే దిశగా నేతలు, కార్యకర్తలతో ఆయన చర్చించనున్నారు. విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి.

మూడు రోజుల పాటు పవన్ షెడ్యూల్ ఇదే:
  • ఈ ఉదయం 11 గంటలకు పార్టీ నేతలు, వివిధ కమిటీ సభ్యులతో సమావేశం
  • ఈ సాయంత్రం 4 గంటలకు పొలిటికల్ అఫైర్స్ కమిటీతో భేటీ
  • రేపు ఉదయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ శ్రేణులతో సమావేశం
  • రేపు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ శ్రేణులతో భేటీ
  • 31వ తేదీ ఉదయం 11 గంటలకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ శ్రేణులతో సమావేశం.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena

More Telugu News