Vijay Devarakonda: 'డియర్ కామ్రేడ్' సక్సెస్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది: రష్మిక మందన

షార్ట్స్‌లో చూడండి
విజయ్ దేవరకొండ - రష్మిక మందన కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్లో నిన్న విడుదలైన 'డియర్ కామ్రేడ్' కూడా సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ .. 'డియర్ కామ్రేడ్'కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది.

ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. విజయ్ దేవరకొండకి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందనీ, నా పాత్రకి న్యాయం చేశానని రాశారు. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది. నా పాత్రను అలా మలిచిన భరత్ కమ్మ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. నా పాత్రను .. ఈ సినిమాను ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని చెప్పింది. 
Go Back to Shorts
Vijay Devarakonda
Rashmika

More Telugu News