vijay devarakonda: విజయ్ దేవరకొండ తదుపరి ప్రాజెక్టు 'హీరో' ఆగిపోలేదట

షార్ట్స్‌లో చూడండి
మైత్రీ మూవీ మేకర్స్ వారు విజయ్ దేవరకొండతో 'హీరో' సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండపై కొన్ని సీన్స్ ను కూడా చిత్రీకరించినట్టు చెప్పుకున్నారు. కానీ ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతోంది. ఈ ప్రచారానికి విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సక్సెస్ మీట్ లో తెరదించేశాడు.

ఈ సక్సెస్ మీట్ వేదికపై విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, "ఈ సినిమాకి ఇంత మంచి ఆదరణ లభిస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఏడాదికాలం పాటు కలిసి పనిచేసిన ఈ టీమ్ లోని వాళ్లందరం దూరమైపోతుండటం బాధ కలిగిస్తోంది. నెక్స్ట్ భరత్ కమ్మ మరో స్క్రిప్ట్ పై కూర్చుంటాడు. రష్మిక 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బిజీ అవుతుంది. ఇక నేను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరో ప్రాజెక్టు చేస్తున్నాను. అందుకు సంబంధించిన పనులతో బిజీ అవుతాను" అని చెప్పుకొచ్చాడు. దాంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై విజయ్ దేవరకొండ చేస్తున్న 'హీరో' ఆగిపోలేదనే విషయం స్పష్టమైంది. 
Go Back to Shorts
vijay devarakonda
Rashmika

More Telugu News