వివాదంలో పాకిస్థాన్ క్రికెటర్... అమ్మాయిల్ని చీట్ చేసినట్టు ఆరోపణలు
- సెలబ్రిటీ ముసుగులో పలువురికి వల
- పెళ్లి చేసుకుంటానంటూ శారీరక సంబంధం
- చాటింగ్ స్క్రీన్ షాట్లను బయటపెట్టిన అక్కడి మీడియా
పాక్ మీడియా కథనం మేరకు...ఓపెనర్ ఇమామ్ తన స్టార్డమ్ని ఉపయోగించుకుని పలువురు యువతులకు వలవేశాడు. పడిన వారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక అవసరం తీర్చుకున్నాడు. గడచిన ఐదారు నెలల్లోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా కొనసాగాయని, ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగానూ ఇది జరిగిందని మీడియా పేర్కొంది.
ప్రపంచకప్లో ఇమామ్ పేలవ ప్రదర్శనకు కూడా ఇదే కారణమని మీడియా కథనం. ప్రస్తుతం ఈ వివాదం క్రికెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపినా అక్కడి క్రికెట్ బోర్డు మాత్రం నోరు మెదపక పోవడం విశేషం.