ఈరోజు అందరూ ‘జీ తెలుగు’ చూడండి.. మీ ప్రేమ కోసం ఎదురుచూస్తున్నాం!: హీరో నాని

  • నేడు ‘జీ తెలుగు’లో జెర్సీ సినిమా
  • వీలైతే చూడాలని అభిమానులకు సూచన
  • ట్విట్టర్ లో స్పందించిన టాలీవుడ్ హీరో
నేచురల్ స్టార్ నానీ, శద్ధ జంటగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ‘జెర్సీ’ సినిమా విమర్శల ప్రశంసలను సైతం అందుకుంది. కొడుకు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా క్రికెట్ బ్యాట్ చేతపట్టి రాణించిన తండ్రి పాత్రలో నాని నటనకు కలెక్షన్ల వర్షం కురిసింది. తాజాగా ఈ సినిమా ఇప్పుడు టీవీలో రానుంది.

ఈ విషయాన్ని నాని స్వయంగా ప్రకటించాడు. జెర్సీ సినిమా ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు ‘జీ తెలుగు’ ఛానల్ లో వస్తుందని నాని తెలిపాడు. అభిమానుల నుంచి మరోసారి ప్రేమను పొందడానికి తమ జెర్సీ టీమ్ ఎదురుచూస్తోందని చెప్పాడు. ఈ మేరకు నాని ట్వీట్ చేశాడు.
Go Back to Shorts
Tollywood
tv
zee telugu
zersey movie

More Telugu News