Biggboss: 90 రోజులు, 14 మంది... బిగ్ బాస్-3 తొలిరోజు షూట్ పూర్తి!

షార్ట్స్‌లో చూడండి
నాగార్జున హోస్ట్ గా టాలీవుడ్ రియాల్టీ షో బిగ్ బాస్ మూడవ సీజన్ తొలిరోజు షూటింగ్ పూర్తయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్లను నాగ్, హౌస్ లోకి పంపారని, ఈ కార్యక్రమాన్ని చూసిన వారు అంటున్నారు. వీరి పేర్లు బయట పెట్టేందుకు ఎవరూ సాహసించలేదు. ఈ కార్యక్రమం నేటి రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. వీరంతా 90 రోజుల పాటు హౌస్ లో గడపనున్నారు.

కాగా, మధ్యలో మరికొందరు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంటర్ అవుతారని తెలుస్తోంది. తొలి రోజు షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగిందని, హోస్ట్ గా నాగార్జున చాలా బాగా చేశాడని కూడా కామెంట్లు వస్తున్నాయి. ఈ సీజన్ బిగ్ బాస్ పలు వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ, ఈ ప్రోగ్రామ్ ను విజయవంతం చేయాలని నిర్వాహకులు భావిస్తున్నారు. తొలిరోజు కార్యక్రమం ప్రోమో కూడా విడుదలైంది.
Go Back to Shorts
Biggboss
Nagarjuna
Realty show
Tollywood

More Telugu News