పెళ్లి తర్వాత ఐదారుగురితో సంబంధాలు నెరిపాను: పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ సంచలన వ్యాఖ్యలు
- ఏడాదిన్నర కాలంలోనే సంబంధాలు పెట్టుకున్నా
- హార్దిక్ పాండ్యాకు కోచింగ్ ఇచ్చి బెస్ట్ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దుతా
- ముస్లిం కాబట్టే మహ్మద్ షమీ బాగా రాణించాడు
కాగా, రజాక్ మాట్లాడుతూ.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోచింగ్ ఇచ్చి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని ఉందన్నాడు. అలాగే, ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత పరాజయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీ ముస్లిం కాబట్టే ఈ మ్యాచ్‌లో బాగా రాణించాడని పేర్కొన్నాడు. రజాక్ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, పాకిస్థాన్ సెమీస్ ఆశలకు భారత్ గండికొట్టిందన్న ఫ్రస్ట్రేషన్‌లోనే అతడీ వ్యాఖ్యలు చేసి ఉంటాడని భావిస్తున్నారు.