మీ టికెట్లు మాకివ్వండి ప్లీజ్... ఇండియాను వేడుకుంటున్న న్యూజిలాండ్!

  • నేడు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్
  • టికెట్లలో అత్యధికం భారత్ ఫ్యాన్స్ వద్దే
  • తమకు ఇవ్వాలంటున్న న్యూజిలాండ్ ఫ్యాన్స్
నేడు లార్డ్ మైదానం వేదికగా, ఇంగ్లండ్ తో జరగబోయే తమ ఫైనల్ మ్యాచ్ లో భారత అభిమానులు తమకు టికెట్లను ఇవ్వాలని న్యూజిలాండ్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ కు భారత్ చేరుతుందని అంచనా వేసిన, బ్రిటన్ లోని ఇండియన్స్, ఫైనల్ మ్యాచ్ ని చూసేందుకు పెద్దఎత్తున ముందుగానే టికెట్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇండియా ఫైనల్ కు రాకపోవడంతో, వారంతా ఆసక్తిగా స్టేడియానికి వచ్చే అవకాశం లేదన్నది న్యూజిలాండ్ అభిమానుల వాదన. ఇక ఆ టికెట్లను తమకు ఇస్తే, తాము మ్యాచ్ ని చూస్తామంటూ, సోషల్ మీడియా ద్వారా పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఏ ఇండియన్ వద్దయినా ఫైనల్ టికెట్ ఉంటే, వారి వద్దకు వచ్చి, డబ్బులిచ్చి తీసుకు వెళతామని అంటున్నారు. తమకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Go Back to Shorts
Cricket
India
England
New Zeland

More Telugu News