జగన్ ఫ్లెక్సీలో దర్శనమిచ్చిన కేటీఆర్.. ఏలూరు నిరసన ర్యాలీలో ఆసక్తికర పరిణామం!

  • డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ జీలుగుమిల్లిలో వైసీపీ ర్యాలీ
  • మాజీ ఎమ్మెల్యే బాలరాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం
  • 2029లో అధికారంలోకి వచ్చేది మేమే అంటూ ఫ్లెక్సీలు

ఏపీ డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో వైసీపీ శ్రేణులు చేపట్టిన నిరసన ర్యాలీ రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన బ్యానర్లు, ఫ్లెక్సీలలో వైసీపీ అధినేత జగన్ తో పాటు తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటో ప్రత్యక్షం కావడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.


"రాసి పెట్టుకోండి. 2029లో అధికారంలోకి వచ్చేది మేమే" అనే నినాదాలతో కూడిన ఈ ఫ్లెక్సీలను పట్టుకుని వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హంగామా చేశాయి. ఏపీ రాజకీయ నిరసన కార్యక్రమంలో పక్క రాష్ట్ర నాయకుడు కేటీఆర్ ఫొటో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఈ వినూత్న ఫ్లెక్సీల వెనుక అంతరార్థమేమిటనే దానిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Advertisement

More Telugu News